: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో యథాస్థానంలో జడేజా, అశ్విన్లు
ఈ రోజు విడుదలైన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో బౌలింగ్ కేటగిరీలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. గత ర్యాంకింగ్స్లో కూడా వారు ఇవే స్థానాల్లో ఉన్నారు. 898 పాయింట్లతో జడేజా, 865 పాయింట్లతో అశ్విన్ వారి గత స్థానాలను పదిలపరుచుకున్నారు. మరే ఇతర భారత బౌలర్ టాప్ 10లో స్థానం సంపాదించుకోలేదు. ఆల్రౌండర్ కేటగిరీలో వీరిద్దరూ రెండు, మూడో స్థానాలు ఆక్రమించారు. ఇక బ్యాటింగ్ కేటగిరీలో పూజారా, విరాట్ కొహ్లీలు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ కేటగిరీలో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ మొదటి స్థానంలో ఉన్నారు. ఇక, ఇంగ్లండ్ జట్టుకు చెందిన మోయిన్ అలీ బౌలింగ్, బ్యాటింగ్ రెండు కేటగిరీల్లో తన కెరీర్లోనే ఉత్తమ ర్యాంకు సంపాదించారు.