: మాట మార్చిన కాంగ్రెస్... చైనా రాయబారితో రాహుల్ భేటీ నిజమేనట!


భారత్ లో చైనా రాయబారితో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారనే విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇవన్నీ అవాస్తవాలేనని... చైనా రాయబారితో రాహుల్ భేటీ కాలేదని కాంగ్రెస్ పార్టీ బుకాయించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే కాంగ్రెస్ మాట మార్చింది. చైనా రాయబారితో రాహుల్ సమావేశం కావడం నిజమేనని చెప్పింది. చైనా రాయబారితో పాటు భూటాన్ రాయబారి, జాతీయ మాజీ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ తో భేటీ అయ్యారని తెలిపింది. వివిధ దేశాలకు చెందిన రాయబారులు, ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను తరచూ కలవడం సాధారణ అంశమేనని చెప్పింది.

  • Loading...

More Telugu News