: జగన్ కోర్టుకు వెళ్లాల్సి ఉన్న రోజునే పాదయాత్ర చేస్తాడట!: ప్రత్తిపాటి పుల్లారావు


నిన్న ముగిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో ఆ పార్టీ అధ్య‌క్షుడు జగన్మోహన్ రెడ్డి పాద‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యంపై ఏపీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు మండిప‌డ్డారు. అక్టోబర్ 27న పాదయాత్ర చేపడతానని జగన్ చెబుతున్నాడ‌ని, కానీ అదే రోజున జ‌గ‌న్‌ కోర్టులో హాజ‌రు కావాల్సి ఉంద‌ని అన్నారు. అటువంటి వ్య‌క్తిని ప్రజలు సీఎం కుర్చీపై కూర్చోబెట్ట‌బోర‌ని అన్నారు. జగన్‌కు సీఎం కుర్చీ, డబ్బు మీద ప్రేమ తప్పితే మరొకటి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, ఏపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేయ‌డానికే  వైసీపీ ప్లీనరీని నిర్వ‌హించిన‌ట్లు ఉంద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.  

  • Loading...

More Telugu News