: హీరో నానిపై ప్రశంసల జల్లు కురిపించిన కేటీఆర్


'నిన్ను కోరి' సినిమాతో టాలీవుడ్ యంగ్ హీరో నాని మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని నాని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో, నానిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ తరం అత్యుత్తమ నటుల్లో నాని ఒకరని కితాబిచ్చారు. నాని ఓ బ్రిలియంట్ పెర్ఫార్మర్ అని పొగడ్తలు కురిపించారు. ఈ వారాంతంలో నాని నటించిన రెండు సినిమాలు చూశానని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై నాని కూడా స్పందించాడు. కేటీఆర్ వ్యాఖ్యలు తనకెంతో గర్వంగా ఉన్నాయని చెప్పాడు. కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపాడు.  

  • Loading...

More Telugu News