: ఐసీసీ టీ20 ర్యాంక్‌లోనూ దిగజారిపోయిన టీమిండియా!
నిన్న వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో టీ20 ర్యాంకుల్లో భారత్ మరింత దిగజారిపోగా వెస్టిండీస్ పైకి దూసుకొచ్చింది. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా ఐదో స్థానానికి పడిపోగా, ఐదో స్థానంలో ఉన్న వెస్టిండీస్ నాలుగో స్థానానికి చేరింది.
ఈ రోజు ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టాప్-5 లో ఉన్న టీమ్‌లు
న్యూజిలాండ్ (125 పాయింట్లు)- నెంబర్ 1
ఇంగ్లాండ్ (123)-2
పాకిస్థాన్ (121) -3
వెస్టిండీస్ (118)-4
ఇండియా (115)-5
టీ20 బ్యాట్స్‌మెన్ జాబితాలో టాప్-5లో నిలిచిన ఆటగాళ్లు
టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ( 804 పాయింట్లతో)- 1
ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ (787)-2
న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ (745)-3
విండీస్ ఆటగాడు ఎవిన్ లెవిస్ (723)-4
ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (718)-5