: అమ్మాయిల మనసు మారింది... సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లను కోరుకోవడం లేదట!


నీకు ఎటువంటి వ‌రుడు కావాలంటే, ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ అయితే బాగుంటుంద‌ని పెళ్లీడుకొచ్చిన‌ అమ్మాయిలు చెప్పే రోజులు త‌గ్గిపోయాన‌ని భారత్‌లో అతిపెద్ద మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో ఒక‌టైన‌ షాదీ.కామ్ పేర్కొంది. ప్ర‌స్తుతం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లను అమ్మాయిలు, వారి కుటుంబ స‌భ్యులు అంత‌గా కోరుకోవ‌డం లేద‌ని తెలిపింది. ప్రస్తుత ప‌రిస్థితుల్లో ఐటీ కంపెనీల్లో ప‌నిచేస్తోన్న యువ‌త‌కు లేఆఫ్స్ భ‌యం ప‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఒక్క‌సారిగా ఉద్యోగం ఊడితే మ‌రో ప‌ని తెలియ‌ని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఇక ఎలా బ‌తుకుతారు? అనే ప్ర‌శ్న వెంటాడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల‌ని చూడ‌మ‌ని చెప్పేవారి సంఖ్య త‌గ్గిపోయింద‌ని ఎక్కువ‌గా ఐఏఎస్‌, ఐపీఎస్‌, డాక్టర్‌, బిజినెస్‌ అల్లుళ్ల కోస‌మే అమ్మాయిల‌ తల్లిదండ్రులు త‌మ వద్ద‌కు వ‌స్తున్నార‌ని మ్యాట్రిమోనియ‌ల్ వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి.  

  • Loading...

More Telugu News