: సర్వీస్ చార్జ్ కావాలంటే జైలుకే... హోటళ్లకు కేంద్రం కఠిన హెచ్చరిక!
తమ వద్దకు వచ్చే కస్టమర్ల నుంచి బలవంతంగా సర్వీస్ చార్జ్ వసూలు చేయాలని చూస్తే, రెస్టారెంట్ యజమానులు జైలుకు వెళ్లాల్సిందేనని కేంద్రం కఠిన హెచ్చరికలు చేసింది. సర్వీస్ చార్జ్ ని టిప్పుగానే పరిగణించాలని, కస్టమర్లు ఇస్తే తీసుకోవాలే తప్ప ఒత్తిడి చేస్తే జైలుకు పంపుతామని చెబుతూ, మార్గదర్శకాలను విడుదల చేసింది.
సర్వీస్ చార్జ్ వసూళ్లపై ప్రజలు వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చని కేంద్ర కార్యదర్శి అవినాశ్ కే శ్రీవత్సవ వెల్లడించారు. కాగా, సర్వీస్ చార్జ్ వసూలు చట్టాల అతిక్రమణేమీ కాదని నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) సెక్రటరీ జనరల్ ప్రకుల్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్రం మార్గదర్శకాలంటూ విడుదల చేస్తున్న నిబంధనలు చట్టాలేమీ కాదని, ఇవి తమ కస్టమర్లలో అయోమయాన్ని పెంచుతున్నాయని ఆరోపించారు.