: 71 బంతుల్లో 21 సిక్సర్లు, 16 ఫోర్లు: ఆఫ్ఘన్ ఆటగాడి విధ్వంసకర ఇన్నింగ్స్


ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి టీ20లకు సరికొత్త భాష్యం చెప్పాడు. స్థానికంగా జరిగిన టీ20 టోర్నీలో ఖతీజ్ క్రికెట్ అకాడమీ తరపున బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘన్ టీ20 జట్టు ఆటగాడు షఫీఖుల్లా షఫీక్ (214) విధ్వసంకర ఇన్నింగ్స్ తో డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 71 బంతులు ఎదుర్కొన్న షఫీక్ 21 సిక్సర్లు, 16 బౌండరీల సాయంతో మొత్తం 214 పరుగులు చేశాడు. అతని దూకుడుతో కేవలం 20 ఓవర్లలో ఆ జట్టు 351 పరుగుల భారీ స్కోరు సాధించింది.

సాధారణంగా క్రికెట్ లోని ఏ ఫార్మాట్ లో అయినా డబుల్ సెంచరీ సాధించడం చాలా కష్టం. ఏ ఆటగాడైనా డబుల్ సెంచరీ చేస్తే అది గ్రేటే... ఇలాంటి అసాధ్యాన్ని ఢిల్లీకి చెందిన మోహిత్ అహ్లవత్ టీ20 చరిత్రలోనే నభూతో నభవిష్యతి అన్న రీతిలో ట్రిపుల్ సెంచరీ కొట్టి పొట్టి ఫార్మాట్ లో ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తాజాగా షఫీక్ డబుల్ సెంచరీ ఘనత సాధించి సత్తాచాటాడు. అఫ్ఘనిస్థాన్ జాతీయ టీ20 జట్టుకు గత మూడు వరల్డ్ కప్ ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2012, 2014, 2016ల్లో జరిగిన ట్వంటీ 20ల్లో ఆడగా, 2014 లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్ లో ఆఫ్ఘన్ జట్టు విజయం సాధించగా, వేగవంతమైన అర్ధసెంచరీ కూడా అదే కావడం విశేషం.

  • Loading...

More Telugu News