: యూపీలో కశ్మీర్ పోలీసుల దాడులు... స్థానిక ఉగ్రవాద నేత సందీప్ శర్మ అరెస్ట్!
యూపీలోని ముజఫరాబాద్ పై దాడులు నిర్వహించిన జమ్మూ కశ్మీర్ పోలీసులు, లష్కరే తోయిబా మాడ్యూల్ నిర్వహిస్తున్న స్థానిక ఉగ్ర నేత సందీప్ శర్మను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుపై కాశ్మీర్ ఐజీపీ మునీర్ ఖాన్ మరిన్ని వివరాలు అందిస్తూ, లష్కరే తోయిబాకు సందీప్ శర్మ సాయపడుతున్నాడని తెలిపారు. రాష్ట్రంలో ఏటీఎంలను లూటీ చేసి, ఆ డబ్బును సందీప్ ఉగ్రవాదులకు అందిస్తున్నాడని, బ్యాంకులు, క్యాష్ వ్యాన్ లనూ లూటీ చేశాడని తెలిపారు. గతంలో లష్కరే మిలిటెంట్ బషీర్ లష్కర్ ఉన్న ఇంటిలోనే సందీప్ ఉంటున్నాడని, స్థానికులకు ఆదిల్ గా పరిచయం అయ్యాడని మునీర్ ఖాన్ తెలిపారు. అతన్ని ప్రస్తుతం విచారిస్తున్నామని, సందీప్ వెనకున్న వారందరినీ అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.