: ఆ నాలుగు దేశాలు ప్రపంచాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయి: పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా, రష్యా, ఉత్తరకొరియా, చైనా దేశాలు ప్రపంచాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని క్యాథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు. రోమ్ లో ఒక టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అధికార కాంక్షతో, బలప్రదర్శన కోసం ఈ నాలుగు దేశాలు ప్రపంచాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. సిరియా లాంటి పేద దేశం మీద యుద్ధం ప్రకటించి అమెరికా ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొందని ఆయన గుర్తుచేశారు. ఆ దాడుల దృశ్యాలను చూస్తుంటే మనసు చలించిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికా, రష్యాలు ఒక కూటమిగా చైనా, ఉత్తరకొరియాలు మరో కూటమిగా ఏర్పడి ప్రపంచ దేశాలను భయపెట్టే ప్రయత్నంలో ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ప్రపంచ గతిని మార్చగల దేశాలు ఇలా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నట్టు కనిపించినప్పటికీ వాటికి కావాల్సింది ప్రపంచంపై ఆధిపత్యం అని, బల ప్రదర్శన ద్వారా ఇతర ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేయాలని ప్రయత్నిస్తున్నాయని, ఈ నాలుగు దేశాలు ఒకే గూటి పక్షులని ఆయన తెలిపారు.