: 7న పార్లమెంట్ లో తెలుగోడి విగ్రహావిష్కరణ.. ప్రముఖుల రాక
తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన వారిలో నందమూరి తారకరామారావు ముందంజలో ఉంటారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసమంటూ పార్టీ ఏర్పాటు చేసిన ఘనత ఆయనది. అవినీతి అంటని నేత. అలాంటి స్వచ్ఛమైన నేతకు పార్లమెంట్ సమున్నత గౌరవాన్ని ఈ నెల 7న సమర్పించనుంది. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆ రోజు భారత అత్యున్నత శాసన వేదిక పార్లమెంట్ లో ఆవిష్కరిస్తారు.
ప్రధాని మన్మోహన్ సింగ్, ఉప రాష్ట్రపతి అన్సారీ, స్పీకర్ మీరాకుమార్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రతిపక్ష నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, శరద్ యాదవ్ తదితరులు హాజరు కానున్నారు. అంతేకాదు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అక్కినేని నాగార్జున, మోహన్ బాబు, జయప్రద, జయాబచ్చన్, చంద్రబాబుకు కూడా ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానాలు అందాయి.