: కమెడియన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్!


ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఎవరైనా సినీ ప్రముఖులు మాట్లాడాల్సి వస్తే శాంత స్వభావుడని, ఆప్యాయంగా పలకరిస్తారని, ఎవరినైనా ఆదరిస్తారని చెబుతుంటారు. తాజాగా పవన్ కల్యాన్ కు కోపం వచ్చిందంటూ, కమెడియన్ పై చిందులు తొక్కాడంటూ సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న సినిమాలో పవన్ నటిస్తున్నారు.

ఆ సినిమాలో నటిస్తున్న ఓ కమెడియన్ షాట్ గ్యాప్ లో జనసేన విధివిధానాలు అడిగే ప్రయత్నం చేశాడట. దీనిపై పవన్ సీరియస్ అయ్యాడట. సినిమాల షూటింగులో రాజకీయాల ప్రస్తావన ఎందుకని మండిపడ్డాడట. హద్దుల్లో ఉండాలంటూ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడట. దీంతో ఆ కమెడియన్ బిక్కచచ్చిపోయాడట. అయితే ఆ కమెడియన్ పేరు మాత్రం బయటకు రాలేదు. త్రివిక్రమ్ గత చిత్రం 'అ...ఆ...'లో ఆ కమెడియన్ నటించాడని ఫిల్మ్ నగర్ భోగట్టా.

  • Loading...

More Telugu News