: సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, ప్రజలు ఓ లెక్కా?: జగన్ విమర్శలు


సొంత మామకే వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబుకు, ప్రజలు ఓ లెక్కా? .. వారిని మోసం చేస్తారంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన మామ నుంచి అధికారాన్ని లాక్కుని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని, అదే, రాజశేఖర్ రెడ్డి ప్రజల దీనెనతో సీఎం అయ్యారని అన్నారు.

లాక్కోవడంలో మోసం ఉంటుంది, ప్రజల ఆశీర్వదం పొందడంలో బాధ్యత ఉంటుందని.. చంద్రబాబుకు, రాజశేఖర్ రెడ్డికి అదే తేడా అని చెప్పారు. చంద్రబాబుకు అబద్ధాలు, మోసాలు కలిసొచ్చాయని, భస్మాసురుడు.. చంద్రబాబు ఒక్కరేనంటూ జగన్ విరుచుకుపడ్డారు. 2014లో తాను మారిపోయానని చంద్రబాబు అన్నారని, మూడేళ్లుగా ప్రజల నెత్తిన చెయ్యి పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని, ఆయన అంత అవినీతిపరుడు దేశంలో ఎక్కడా లేడని, బాబు పాలన అంతా అవినీతిమయమేనంటూ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

  • Loading...

More Telugu News