: ఏపీలో 8 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌


టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను కార్పొరేషన్ పదవి వరించింది. ఏపీలో 8 కార్పొరేషన్లకు చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నియమించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా జలీల్‌ఖాన్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గా జేఆర్ పుష్పరాజ్, ఏపీ ఫిల్మ్ టెలివిజన్ అండ్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అంబికా కృష్ణ, ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా ఎండీ నౌమాన్, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎరిక్సన్ బాబు, మీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రకాశ్‌నాయుడు, కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తుడా చైర్మన్‌గా జి. నర్సింహ యాదవ్ ను ప్రభుత్వం నియమించింది.

  • Loading...

More Telugu News