: వేదికపైకి ప్రశాంత్ కిషోర్ ను స్వయంగా ఆహ్వానించిన జగన్


ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను వైఎస్సార్సీపీ అధినేత జగన్  పార్టీ  శ్రేణులకు స్వయంగా పరిచయం చేశారు. గుంటూరులో జరుగుతున్న వైఎస్సార్సీపీ ప్లీనరీ వేదికపైకి  ప్రశాంత్ కిషోర్ ను జగన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో కలుపుదామని, అందుకోసం మనమందరం ఏకమవుదామని అన్నారు. మనకు ప్రశాంత్ కిషోర్ తోడుగా ఉంటారని, 2014లో మోదీని ప్రధాని సీట్లో కూర్చోబెట్టడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారని, ఆ తర్వాత బీహార్, పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ ను, కెప్టెన్ అమరీందర్ సింగ్ ను ఆయన గెలిపించారని అన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మనతో ఉంటారని అన్నారు. 

  • Loading...

More Telugu News