: ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత శస్త్రచికిత్సలు ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్... వైఫల్యమేనన్న బీజేపీ


ఢిల్లీ వాసులకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం మరో వరాన్ని ప్రకటించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు ఆలస్యమవుతున్నాయని భావించిన వారు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వాటిని ఉచితంగా చేయించుకోవచ్చని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇందుకోసం 48 ప్రైవేటు ఆసుపత్రులను ఎంపిక చేశామని, ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా తదితర ప్రాంతాల్లో 24 ప్రభుత్వ ఆసుపత్రులు రిఫర్ చేసే రోజున ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లవచ్చని తెలిపారు.

బైపాస్, కిడ్నీ, ప్రొస్టేట్, థైరాయిడ్ సహా 52 రకాల లైఫ్ సేవింగ్ సర్జరీస్ చేయించుకోవచ్చని ఆయన తెలిపారు. నెల రోజుల వ్యవధిలో శస్త్రచికిత్సకు డేట్ లభించని వారంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు అర్హులని అన్నారు. వారి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చని తెలిపారు. దీనిపై బీజేపీ స్పందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల వైఫల్యంతోనే కేజ్రీవాల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని విమర్శలు గుప్పించింది. తన ప్రభుత్వంలోని అతినీతి బాగోతాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని ఆయన ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News