: గురు పౌర్ణమిని గుర్తు చేసుకున్న నాసా!


ఇండియాలో వైభవంగా జరిగే గురు పౌర్ణమి లేదా ఆషాడ పున్నమిని 'నాసా' గుర్తు చేసుకుంది. తన అధికార ట్విట్టర్ ఖాతాలో అద్భుతమైన చంద్రుడి చిత్రాన్ని ఉంచుతూ, 'నిండైన చంద్రుడు రానున్నాడు. దీన్ని గురు పూర్ణిమ అని కూడా అంటారు. హే మూన్, మీడ్ మూన్, రైప్ కార్న్ మూన్, బక్ మూన్ అని కూడా పిలుస్తారు. మేము మాత్రం థండర్ మూన్ అని ముద్దుగా పిలుచుకుంటాం' అంటూ నాసా పేర్కొంది. ఇక నాసా పెట్టిన ట్వీట్ నాలుగు వేలకు పైగా రీట్వీట్ అయింది. ఎంతో మంది భారతీయులు గురు పౌర్ణమిని నాసా తలచుకోవడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News