: టాలీవుడ్ లో మంచివాళ్లతో పాటు చెడ్డవాళ్లూ ఉన్నారు: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్‌లోని అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకుంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వారు ఇండస్ట్రీలో అడుగుట్టగానే, వారికి పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు రావడం అంత సులువు కాదని చెప్పింది. అందుకే తాను వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా పేరు తెచ్చుకుంటూ ముందుకు వెళుతున్నానని చెప్పింది.
టాలీవుడ్‌లో గొప్ప విషయం ఏమిటంటే, స్టార్ నటులను, కొత్త నటులను ఇద్దర్నీ ఒకేవిధంగా చూస్తారని ఈ భామ చెప్పింది. తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్‌ను ఎంతో గౌరవిస్తారని పేర్కొంది. అయితే, టాలీవుడ్‌లో మంచివాళ్లతో పాటు చెడ్డవాళ్లు కూడా ఉన్నారని వ్యాఖ్యానించింది. తెలుగు ఇండస్ట్రీలో మనల్ని మనం ఎలా పరిచయం చేసుకుంటున్నామనేది ముఖ్యమని చెప్పింది. ఎవరు ఎలాంటి వ్యక్తులో అర్థం చేసుకోవడం ఎంతో అవసరమని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.