: ఎన్టీఆర్ సినిమాలో ఆయనే అసలైన విలన్!: వైసీపీ నేత జోగి రమేష్
ఎన్టీఆర్ సినిమాలో హీరోగా తన మామ బాలయ్య అయితే సరిపోతారని నారా లోకేష్ చెప్పారని... బాలయ్య వరకు ఓకే, మరి విలన్ ఎవరు? అంటూ వైసీపీ ప్లీనరీలో పార్టీ కార్యకర్తలను ఆ పార్టీ నేత జోగి రమేష్ ప్రశ్నించారు. దీనికి స్పందనగా 'చంద్రబాబు' అంటూ సమాధానం వచ్చింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవిత చరిత్రలో అసలైన విలన్ చంద్రబాబే అని అన్నారు. చంద్రబాబును విలన్ గా పెట్టే రామ్ గోపాల్ వర్మ సినిమాను తీయాలని కోరారు. ఎన్టీఆర్ ను రాళ్లతో, చెప్పులతో కొట్టించింది చంద్రబాబే అని, ఆయన చావుకు బాబే కారణమని చెప్పారు. ఎన్టీఆర్ సినిమాను వర్మ స్పష్టంగా తీయాలని... ఆయన మరణానికి కారణం చంద్రబాబే అనే విషయాన్ని చూపించాలని అన్నారు.