: కొడాలి నాని ఉల్లిపాయ పకోడి లాంటోడు!: బుద్దా వెంకన్న ఎద్దేవా


వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. టీడీపీపై నాని విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచి, అదే పార్టీపై విమర్శలు చేయడం దారుణమని చెప్పారు. ముఖ్యమంత్రిని విమర్శించేంత స్థాయి నానికి లేదని అన్నారు. కొడాలి నాని ఉల్లిపాయ పకోడిలాంటోడని ఎద్దేవా చేశారు. ఆయన మాటలను ఎవరూ పట్టించుకోరని అన్నారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే అంశాన్ని వైసీపీ యూనివర్శిటీ నేర్పిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న చీటర్స్ అందరూ కలసి వైసీపీ ప్లీనరీని ఏర్పాటు చేశారని అన్నారు. 2019 నాటికి వైసీపీ దుకాణం బంద్ అవుతుందని... ఆ పార్టీ అధినేత జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. 

  • Loading...

More Telugu News