: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణ హత్య!
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్-7లో నడిరోడ్డుపై హత్య జరిగింది. కత్తులతో ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు బంజారాహిల్స్‌లో ఉన్న ఒకరిని దారుణంగా పొడిచి చంపేశారు. హతుడు ఓ పాత నేరస్తుడని తెలుస్తోంది. ఓ సెటిల్ మెంట్ కోసం అతడిని ఇక్కడకు రమ్మని చెప్పిన కొందరు దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, హత్యకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలను ప్రారంభించారు. నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు భయపడిపోయారు.