: జీఎస్టీ క‌ష్టాలు ఇక చెల్లు... యాప్ విడుద‌ల చేసిన క‌స్టమ్స్ బోర్డ్‌


జీఎస్టీ - అమ‌ల్లోకి వ‌చ్చి వారం రోజులైనా ఇంకా ఎలా లెక్కిస్తారో అర్థం కాని ప‌రిస్థితి కనపడుతోంది. అర్థ‌మైన‌ట్లే ఉంటుంది, తీరా బిల్లు చూస్తే ఊహించిన దానికంటే ఎక్కువొస్తుంది. ఇంకేం చేయ‌గలం.. మారు మాట్లాడ‌కుండా క‌ట్టేసి రావ‌డం త‌ప్ప‌. ఇక ఆ అవ‌స‌రం లేదు. ఏ వ‌స్తువుపై ఎంత జీఎస్టీ అనే విష‌యాన్ని ఒక్క బ‌ట‌న్ నొక్క‌గానే తెలుసుకునే సౌక‌ర్యాన్ని సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ క‌స్ట‌మ్స్ క‌ల్పించింది. ఇందుకోసం `జీఎస్టీ రేట్ ఫైండ‌ర్‌` అనే యాప్‌ని రూపొందించింది. దీని ద్వారా జీఎస్టీకి సంబంధించిన అన్ని వివ‌రాలు క్ష‌ణాల్లో తెలుసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

  • Loading...

More Telugu News