: రాజధాని వద్దన్న ప్రాంతంలో ప్లీనరీనీ జగన్ ఎలా నిర్వహిస్తారు?: కళా వెంకట్రావు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏపీ రాజధానిని నిర్మించరాదంటూ రాద్ధాంతం చేసిన వైసీపీ అధినేత జగన్... ఇప్పుడు అదే ప్రాంతంలో ప్లీనరీ సమావేశాలను నిర్వహించడం ఎంతవరకు సమంజసమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. జగన్ కు ప్రజా సేవ చేయాలనే కోరిక ఏమాత్రం లేదని... కేవలం కేసులు నుంచి తప్పించుకునేందుకే పార్టీని నడిపిస్తున్నారని అన్నారు. ఈ రోజు మంగళగిరి ఆలయాన్ని వెంకట్రావు దంపతులు దర్శించుకున్నారు. పానకాల లక్ష్మీనరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.