: ఎర్రచందనం స్మగ్లర్ తో మాట్లాడేందుకు యత్నించిన వైసీపీ నేతలు.. అనుమతించని పోలీసులు
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నిన్న ఆయనను రైల్వే కోడూరు న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడేందుకు రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో పాటు కొందరు వైసీపీ నేతలు కోర్టు వద్దకు వచ్చారు. అయితే, వారు గంగిరెడ్డిని కలిసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో, వారు తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రైల్వేకోడూరు ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, 2014లో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు విచారణలో భాగంగానే గంగిరెడ్డిని కోర్టుకు తీసుకొచ్చామని తెలిపారు. వాయిదా ఉన్నందువల్ల కోర్టులో హాజరుపరిచామని చెప్పారు.