: మీడియాతో పెద్ద తలనొప్పి: ప్రముఖ దర్శకుడు తేజ
అర్థం లేని ప్రశ్నలు అడిగి తనని వివాదాల పాలు చేసే మీడియాతో పెద్ద తలనొప్పి అని దర్శకుడు తేజ అన్నారు. అందుకే పదేళ్ల వరకు మీడియాతో మాట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఆయన ఇలా అనడానకి కారణం లేకపోలేదు. నటీనటులను ఆయన చాలా ఇబ్బంది పెడతాడని, ఒక పద్ధతి లేకుండా షూటింగ్ చేస్తాడని కొందరు తేజపై రాశారట. బహుశా ఇలాంటి పుకార్లు `నేనే రాజు నేనే మంత్రి` సినిమాతో కూడా రాకూడదనే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేమోనని సినీవర్గాల అభిప్రాయం. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో భారీ అంచనాలు పెంచేసిన `నేనే రాజు నేనే మంత్రి` సినిమా ప్రచార కార్యక్రమాలు ఎలా చేస్తారో చూడాలి మరి.