: శ్రీదేవి గురించి నేను ఆ విష‌యం చెప్ప‌కుండా ఉండాల్సింది: ఎస్ఎస్ రాజ‌మౌళి


బాహుబలి సినిమాలో శివ‌గామి పాత్ర కోసం ముందు అందాల సుంద‌రి శ్రీదేవిని క‌లిస్తే ఆమె లేనిపోని డిమాండ్లు పెట్టిన విష‌యాన్ని మీడియాతో చెప్ప‌కుండా ఉండాల్సిందని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అన్నారు. 'బాహుబ‌లి-2' విడుద‌ల‌య్యాక ఓ ప్రెస్‌మీట్‌లో శ్రీదేవి గురించి రాజ‌మౌళి మాట్లాడిన మాట‌ల‌పై ఆమె ఘాటుగా స్పందించారు. `రాజ‌మౌళి ఇలా మాట్లాడుతార‌ని అనుకోలేదు. బాహుబ‌లిలో పాత్ర కోసం న‌న్ను అడ‌గ‌డం అనేది జ‌రిగిపోయిన విష‌యం. దాని గురించి ఇప్పుడు మాట్లాడ‌టం ఎందుకు? అలా అనుకుంటే నేను వ‌దిలేసుకున్న మంచి మంచి పాత్ర‌లు ఎన్నో ఉన్నాయి. మ‌నం చేజార్చుకున్న సినిమాల గురించి మాట్లాడుకోవ‌డం అమ‌ర్యాద‌కరం` అని శ్రీదేవి అన్నారు.

ఈ మాట‌ల‌పై రాజ‌మౌళి స్పందిస్తూ - `నిజ‌మే... నేను అంద‌రిముందు అలా మాట్లాడి ఉండ‌కూడ‌దు. ఈ త‌ప్పు చేసినందుకు ప‌శ్చాత్తాపం చెందుతున్నాను. శ్రీదేవి అంటే నాకు చాలా గౌర‌వం. ద‌క్షిణాది నుంచి వెళ్లి ముంబైలో కొన్ని సంవ‌త్స‌రాలుగా మ‌న ఖ్యాతిని నిలుపుతున్నారు. ఆమె `మామ్‌` సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను` అన్నారు.

  • Loading...

More Telugu News