: సింగర్ అవతారం ఎత్తుతున్న హర్భజన్ సింగ్
క్రికెట్లో బంతితో వికెట్లు పడగొట్టడమే కాదు.. తన పాటతో భారతీయుల హృదయాలు కొల్లగొడతానని అంటున్నాడు భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. అంతేకాదు కంపోజర్ మిథున్‌తో కలిసి త్వరలో ఓ మ్యూజిక్ వీడియో కూడా విడుదల చేయనున్నాడు. దేశాభివృద్ధిలో తమ వంతు కృషి చేసిన నిజజీవిత హీరోలందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో రూపొందించనున్నారు. ఇప్పటికే పాటకు సంబంధించిన శిక్షణను హర్భజన్ తీసుకుంటున్నట్లు మిథున్ తెలిపాడు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఉండే ఈ పాటను దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిత్రీకరించనున్నారు. దేశాన్ని ముందుకు నడిపే వారి సాధారణ జీవితాలు నేపథ్యంగా ఈ వీడియో చిత్రీకరించనున్నారు. చిత్రీకరణ పూర్తయ్యాక డిసెంబర్లో వీడియోను విడుదల చేస్తామని మిథున్ చెప్పాడు.