: నా కొడుకు సడెన్ గా అంత మాట అనేశాడు... ఇప్పుడు ఇంటికెళ్లి వాళ్లమ్మతో తేల్చుకోవాలి: జూనియర్ ఎన్టీఆర్


తన కుమారుడితో తనకు చాలా అటాచ్ మెంట్ ఉందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. తాను ప్రతిరోజూ షూటింగ్ కు వెళ్లే ముందు వాడిని దగ్గరకి తీసుకుని "నీకు ఎవరంటే ఇష్టం నాన్నా...అమ్మా? నాన్నా?" అని అడిగితే వాడు టక్కున "నాన్న" అని సమాధానం చెప్పేవాడని అన్నారు. అయితే ఈ మధ్యనే వాడిని స్కూల్ లో జాయిన్ చేయడంతో "నేను షూటింగ్  నుంచి వచ్చేసరికి వాడు నిద్రపోతున్నాడు...మళ్లీ నేను నిద్రలేచేసరికి స్కూల్ కి వెళ్లిపోతున్నాడు"... దీంతో ఉదయం వాడు "నాన్నా" అనుకుంటూ తన దగ్గరకి వచ్చాడని, వాడితో మాట్లాడుతూ.."నాన్నా నీకు ఎవరంటే ఇష్టం అమ్మా? నాన్నా?" అని అడగ్గానే ఎప్పుడూ "నాన్న" అనే వాడు అకస్మాత్తుగా "అమ్మ" అనేశాడని... తాను షూటింగ్ లకు వెళ్తుండడంతో వాడు, వాళ్లమ్మ ఒక్కటైపోయారని... ఇంత పెద్ద కుట్ర ఎప్పుడు జరిగిందో ఇంటికెళ్లగానే వాళ్లమ్మతో తేల్చుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో అంతా నవ్వేశారు. 

  • Loading...

More Telugu News