: కాలాన్ని బట్టి మారుతూ వచ్చాం: జూనియర్ ఎన్టీఆర్


మనం కాలాన్ని బట్టి మారుతూ వచ్చామని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. బిగ్ బాస్ షో కూడా అలాగే అందర్నీ ట్యూన్ చేస్తుందని అన్నాడు. మనందరం తెలిసో, తెలియకో సోషల్ మీడియా కారణంగా ఒక పబ్లిక్ ఫ్లాట్ ఫాం మీదకి వచ్చామని అన్నాడు. అందువల్ల ఎవరు ఎలా ఉంటారు? ఎలా వ్యవహరిస్తారు? ఎలా ఉండాలనుకుంటారు? అన్న విషయాలన్నీ తెలిసిపోతున్నాయని, బిగ్ బాస్ కూడా అలాంటి ప్లాట్ ఫామేనని చెప్పాడు. ఈ జర్నీలో ప్రతి అంశం ఒక ఛాలెంజింగ్ అంశమేనని, ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. ఈ షో గురించి ముందుగా ఏమీ అనుకోలేదని, అప్పుడు అవసరాన్ని బట్టి వ్యవహారశైలి ఉంటుందని అన్నాడు. విజయం, పరాజయం గురించి పక్కనబెట్టి మనం ఏదో ఒక పని చేయాలని, అదే తాను చేస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. 

  • Loading...

More Telugu News