: ట్రంప్, పుతిన్ బంగారు బొమ్మలతో నోకియా ఫోన్ @ 1.6 లక్షలు!
జర్మనీలోని హాంబర్గ్ లో ప్రపంచ దేశాధినేతలు జీ-20 సమావేశాలకు హాజరైన సందర్భంగా నోకియా ప్రత్యేకమైన ఫోన్ ను విడుదల చేసింది. గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బొమ్మతో ప్రత్యేక ఫోన్ ను విడుదల చేసిన నోకియా దానికి విశేషమైన ఆదరణ లభించడంతో తాజాగా పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల బొమ్మలతో సరికొత్త ఫోన్ ను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. 3310 మోడల్ ఫోన్ బ్యాక్ కవర్ పై టైటానియం ప్లేట్ ను ఏర్పాటు చేసి అక్కడ ఈ బొమ్మలను ముద్రించి, దానిపై బంగారం పూత పూశారు. లిమిటెడ్ ఎడిషన్ ను మాత్రమే ఈ తరహాలో విడుదల చేసిన నోకియా దీని ధరను 2,468 డాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీ ఈ ఫోన్ విలువ 1.6 లక్షల రూపాయలు కావడం విశేషం.