: లాడెన్ పై అభిమానంతోనే ఉగ్రవాదం బాట పట్టా: సిట్ విచారణలో సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్
ఐసిస్ సానుభూతిపరుడు సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్ ను విచారించిన సిట్ అధికారులకు కీలక విషయాలు తెలిశాయి. ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ పై అభిమానంతోనే తాను ఉగ్రవాద బాట పట్టానని, ఐసిస్ లో చేరానని, ముంబైలో పెట్రోల్ బాంబు తయారీపై శిక్షణ తీసుకున్నానని చెప్పాడు. ఉగ్రవాదం వైపు యువతను ఆకర్షించేందుకు సామాజిక మాధ్యమాలను బాగా వినియోగించుకున్నానని చెప్పినట్టు సమాచారం. కాగా, కొన్నిరోజుల క్రితం ఒమర్ ను హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ముంబైలో ఒమర్ బస చేసిన హోటల్ లోని రిజిస్టర్లను సిట్ అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు.