: రైల్వే స్టేషన్లో ప్రయాణికుడి గానాబజానా.. ఎంకరేజ్ చేసిన సాటి ప్రయాణికులు.. మీరూ చూడండి!
పలు సినిమాల్లో హీరోలు రైల్లో, రైల్వే స్టేషన్‌లో పాటలు పాడి అందరినీ ఆకర్షిస్తుంటారు. ఇటువంటి ఘటనలు నిజజీవితంలో జరగడం చాలా అరుదు. ఒకవేళ సాధారణ ప్రయాణికులు పాటలు పాడుకున్నా మెల్లిగా పాడుకుంటారు. అయితే, ఉత్తరాఖాండ్ లోని నైనిటాల్ లో ఓ యువకుడు పాడిన పాటకు విశేష స్పందన వచ్చింది. నైనిటాల్ లో రైలు ఆగడంతో తన ఫ్రెండ్స్ తో పాటు కిందకు దిగిన పశ్చిమబెంగాల్ యువకుడు సౌవిక్ అందరి దృష్టినీ ఆకర్షించాడు.
టైమ్ పాస్ కోసం అతడి స్నేహితులు పాటలు పాడమని ఓ గిటార్ ఇచ్చారు. దీంతో ఆ యువకుడు బాలీవుడ్ పాటలు పాడడం మొదలుపెట్టాడు. ఇక రైలులోని ప్రయాణికులంతా దిగివచ్చి సౌవిక్ చుట్టూ చేరి ఆ పాట విని ఆనందించారు. ఓ యువకుడు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అతని గానం అద్భుతం.. మహాద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.