: జమైకాలో బర్త్ డే బోయ్ ధోనీ ఇలా...!


టీమిండియా ఆటగాడు, మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ తన 36వ పుట్టినరోజు జరుపుకున్నాడు. భార్య సాక్షి, టీమిండియా సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశాడు. జమైకాలో నిన్న రాత్రి పన్నెండు గంటల సమయంలో ధోనీ కేక్ కట్ చేస్తున్న వీడియోను ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. బెడ్ పై కూర్చుని ఉన్న ధోనీ కేక్ కట్ చేస్తుండగా, భార్య సాక్షి, జట్టు సభ్యులు, అతిథులు బర్త్ డే సాంగ్ పాడుతూ ఉత్సాహపరిచారు. ధోనీ ముఖానికి కేక్ క్రీమ్ పూసి ఉన్న ఓ ఫొటోనూ హార్దిక్ పాండ్యా పోస్ట్ చేశాడు. కాగా, భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News