: ఐఐటీల్లో తదుపరి కౌన్సెలింగ్, ప్ర‌వేశాలు నిలిపివేయండి: సుప్రీంకోర్టు


జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) ప్ర‌వేశ ప‌రీక్ష ద్వారా ఐఐటీల్లో తదుపరి కౌన్సెలింగ్‌, అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌ను నిలిపివేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) ప్ర‌వేశ ప‌రీక్ష‌కు సంబంధించిన‌ ఫిర్యాదుల‌ను దేశంలోని ఏ హైకోర్టు ఇక నుంచి ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవ‌ద్ద‌ని జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా ధ‌ర్మాస‌నం పేర్కొంది. అంతేకాకుండా శ‌నివారంలోగా ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌పై ఇప్ప‌టివ‌ర‌కు పెండింగ్‌లో ఉన్న‌ ఫిర్యాదుల గురించి, వాటిని వేసిన పిటిష‌న‌ర్ల సంఖ్య వివ‌రాల‌ను తెలియ‌జేయాల‌ని అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జ‌న‌ర‌ళ్ల‌ను ఆదేశించింది. హిందీ భాష ప్ర‌శ్నాప‌త్రం ముద్ర‌ణ‌లో త‌ప్పిదాల వ‌ల్ల జేఈఈ ప్ర‌వేశ ప‌రీక్ష రాసిన వారంద‌రికీ అద‌నంగా ఏడు మార్కులు క‌ల‌ప‌డంపై కేంద్రానికి వ్య‌తిరేకంగా వేసిన‌ పిటిష‌న్ విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.

  • Loading...

More Telugu News