: ఆ గాడిదకు స్మారక విగ్రహం కట్టించి ప్రదర్శనగా ఉంచారు!
బతికున్న ఓ గాడిదను పులులకు ఆహారంగా వేసిన విషాద సంఘటన చైనాలోని ఛాంగ్ చూ జూ లో గత నెలలో చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ దారుణంపై జంతుప్రేమికులు, నెటిజన్లు సదరు జూ సిబ్బందిపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జూ అధికారులు పశ్చాత్తాపపడ్డారేమో, ఆ గాడిదకు స్మారక విగ్రహం కట్టించి, జూ లో ప్రదర్శనగా ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారడంతో జంతుప్రేమికులు, నెటిజన్లు ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.