: అమరావతిపై ఆళ్ల కేసు విచారణ... హైకోర్టులోనే తేల్చుకోవాలన్న సుప్రీంకోర్టు


ఏపీ రాజధాని అమరావతి కోసం చేపట్టిన భూ సేకరణ అంశం ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం కేసును విచారించింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. 2013 భూ సేకరణ చట్టం సరిగా అమలు కావడం లేదని మూడు పంటలు పండే భూములను నోటిఫై చేయకుండానే భూ సేకరణ చేపట్టారని తన పిటిషన్ లో ఆర్కే ఆరోపించారు. ఈ నేపథ్యంలో, కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం... ఈ కేసును హైకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో అక్కడకే వెళ్లాలని పిటిషనర్ కు సూచించింది. హైకోర్టు తీర్పు తర్వాత అవసరమైతే మళ్లీ తమను ఆశ్రయించవచ్చని తెలిపింది. 

  • Loading...

More Telugu News