: 3630 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, డ్యుయల్ కెమెరాతో నుబియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్
ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ జడ్‌టీఈ.. 13 మెగాపిక్సెల్‌తో రెండు వెనుక కెమెరాలతో భారత్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. చైనాకు చెందిన ఈ కంపెనీ ఇటీవలే నుబియా ఎన్2 స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నుబియా ఎం2 పేరుతో రూ. 22,999 ధరతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ఈ నెల 10 నుంచి అమేజాన్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. 3630 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో 5.5 అంగుళాల డిస్ప్లేతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించారు. ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమొరీ, 13 మెగాపిక్సెల్‌తో రెండు వెనుక కెమెరాలు, 16 మెగాపిక్సెల్ ముందు కెమెరా ఇందులో ఫీచర్లు.