: మా డేటింగ్ యాప్ ఉంటే, ఒకరి వివరాలు ఉచితం: 'హాపెన్' ఆఫర్
ప్రపంచంలోని 40 దేశాల్లో మూడు కోట్ల మందికి పైగా వినియోగదారులను కలిగుండి, ఈ సంవత్సరం ఏప్రిల్ లో భారత్ కు వచ్చి, విజయవంతమైన డేటింగ్ యాప్ 'హాపెన్' ఓ కొత్త ఆఫర్ ను ప్రకటించనుంది. మరింత మంది స్మార్ట్ ఫోన్ కస్టమర్లకు చేరాలన్న లక్ష్యంతో 'క్రష్ టైం' పేరిట కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది. ఈ ఫీచర్ లో భాగంగా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, వారికి దగ్గర్లో ఉన్న నలుగురి ప్రొఫైల్స్ ను చూపుతుంది. వాటి నుంచి ఒక ప్రొఫైల్ ను ఎంచుకుంటే, వారి వివరాలన్నీ ఈ యాప్ అందిస్తుంది. ఆపై వారితో మాట్లాడుకోవచ్చు. కలవాలో, వద్దో నిర్ణయించుకోవడం వారిష్టం. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్ ను మరికొన్ని వారాల్లో అందుబాటులోకి తెస్తామని హాపెన్ వెల్లడించింది.