: చైనాను చాలెంజ్ చేసిన యూఎస్ బాంబర్లు!


దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు తిరిగి వచ్చాయని స్వయంగా యూఎస్ ఎయిర్ ఫోర్స్ శుక్రవారం నాడు ప్రకటించింది. అది అంతర్జాతీయ ప్రాంతమని, ఏ దేశానికీ హక్కులు లేవని చెప్పేందుకే తమ విమానాలను అక్కడికి పంపామని స్పష్టం చేసింది.  గువామ్సా నుంచి టేకాఫ్ అయిన రెండు యూఎస్ బీ-1బీ లాన్సర్ బాంబర్గు, చైనా కృత్రిమంగా నిర్మించిన దీవులకు 12 నాటికల్ మైళ్ల దగ్గరగా వెళ్లాయని అమెరికా వాయుసేన ప్రతినిధి మేజర్ ర్యాన్ సింప్సన్ ఓ ప్రకటనలో తెలిపారు.

5 ట్రిలియన్ డాలర్ల విలువైన సరకు రవాణా జరిగే దక్షిణ చైనా సముద్రంలో అత్యధిక భాగం తమదేనని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజా ఘటన చైనా ముందు సవాల్ వంటిదేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. దీనిపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు హాంబర్గ్ చేరిన యూఎస్, చైనాల అధ్యక్షుడు ట్రంప్, జిన్ పింగ్ లు ఉత్తర కొరియా దూకుడును తగ్గించే అంశంపై ప్రత్యేకంగా చర్చలు సాగించనున్నారు.

  • Loading...

More Telugu News