: టైమంటే టైమే... డెలివరీ ఆలస్యానికి మూల్యం 1.2 బిలియన్ డాలర్లు!


చెప్పిన సమయానికి డెలివరీ చేయలేదని ఖతార్ ఎయిర్ వేస్ సంస్థ ఎయిర్ బస్ తో చేసుకున్న ఒప్పందాన్ని ఉపసంహరించుకుంది. ఖతార్ ఎయిర్ వేస్ సంస్థ ఏ350 రకానికి చెందిన నాలుగు జెట్ ఎయిర్ బస్ విమానాల కోసం ఎయిర్ బస్ సంస్థకు బిలియన్ డాలర్లకు ఆర్డర్ ఇచ్చింది. ఈ మేరకు ఒప్పందాలన్నీ చేసుకున్న సమయంలో ఖతార్ ఎయిర్ వేస్ సకాలంలో విమానాలను అందించాలని, ఏవేవో కారణాలు చెప్పి డెలివరీ ఆలస్యం చేస్తే ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు వెనుకాడమని ఎయిర్ బస్ కు స్పష్టం చేసింది. అయితే ఖతార్ ఎయిర్ వేస్ హెచ్చరించినట్టే ఎయిర్ బస్ విమానాల డెలివరీని ఆలస్యం చేసింది. దీంతో ఖతార్ ఎయిర్ వేస్ గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎయిర్ బస్ కు 1.2 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. అయితే ఆ నాలుగు విమానాల తయారీ పూర్తి చేసే ఇతర సంస్థలకు విక్రయిస్తే నష్టం తగ్గే అవకాశం ఉంది. 

  • Loading...

More Telugu News