: 23న ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా వీడ్కోలు


భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి జూలై 23న పార్లమెంటు ఘనంగా వీడ్కోలు పలకనుంది. ఉభయసభలు ఆయనకు వీడ్కోలు చెబుతాయి. జూలై 24తో రాష్ట్రపతిగా ప్రణబ్ దాదా పదవీకాలం ముగియనుంది. జూలై 25న కొత్త రాష్ట్రపతి పదవీస్వీకారం చేయనున్నారు. ప్రణబ్ వీడ్కోలుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2012 జూలై 25న 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీబాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరపున కోవింద్, విపక్షాల అభ్యర్థిగా మీరాకుమార్ పోటీపడుతున్నారు. వీరిద్దరిలో ఒకరు తదుపరి రాష్ట్రపతి కానున్నారు.

  • Loading...

More Telugu News