: మద్యం షాపుల గురించి ఆందోళన వద్దు.. సమస్య వుంటే ఫోన్ చేయండి... నా నంబర్ 9951314101: ఏపీ మంత్రి జవహర్


మహిళలు ఎవరూ మద్యం షాపుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏదైనా సమస్య ఉంటే తన ఫోన్ కు డైరెక్టుగా కాల్ చేయాలని చెబుతూ ఏపీ ఎక్సైజ్ మంత్రి కేఎస్ జవహర్ తన సెల్ నంబరును బహిరంగంగా ప్రకటించారు. తన నంబర్ 9951314101 అని చెప్పిన ఆయన, కాల్ చేస్తే, సమస్యను పరిష్కరిస్తామన్నారు. మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లను అనుమతించబోమని, ఇళ్ల మధ్యలో షాపులుండవని భరోసా ఇచ్చిన ఆయన, అనుమతించిన వాటిల్లో 54 శాతం మద్యం షాపులు, 30 శాతం బార్లు మాత్రమే రాష్ట్రంలో ప్రారంభమయ్యాయని వెల్లడించారు.

మద్యం దుకాణాలు తెరుచుకోకపోవడం వల్ల రూ.120 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. మద్యం వ్యాపారంలో అధికార పార్టీకి చెందిన వారి సంఖ్య తనకు తెలియదని వ్యాఖ్యానించిన జవహర్, తాను మంత్రిగా వచ్చిన తరువాత 6,324 కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. 921 మందిని అరెస్ట్ చేశామని అన్నారు. మద్యం షాపులకు సంబంధించి తనకు 13 ఫిర్యాదులు వస్తే, వాటిల్లో 11 నిజమైనవేనని తేల్చామని, కొన్ని ప్రాంతాల్లో కావాలనే గొడవలు చేస్తున్నట్టు తెలుస్తోందని చెప్పారు.

  • Loading...

More Telugu News