: తన చిన్న కుమార్తె ఏం కావాలనుకుంటోందో వెల్లడించిన శ్రీదేవి
నిన్నటి అందాలతార శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, ఖుషిలు ఇంకా తమ కెరియర్ ను ప్రారంభించకముందే... వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అమాంతం పెరిగిపోతోంది. జాహ్నవి త్వరలోనే తెరంగేట్రం చేయబోతోంది. మరి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి ఏం కాబోతోందో అనే డౌట్ అందర్లోనూ ఉంది. ఈ నేపథ్యంలో, డీఎన్ఏకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుషి గురించి శ్రీదేవి క్లారిటీ ఇచ్చింది. ఖుషి మోడలింగ్ వైపు అడుగులు వేస్తోందని ఆమె తెలిపింది. తొలుత ఆమె డాక్టర్ కావాలనుకుందని, ఆ తర్వాత లాయర్ కావాలనుకుందని, ఇప్పుడు మోడలింగ్ వైపు దృష్టిని సారించిందని చెప్పింది. ఖుషి మోడలింగ్ కెరియర్ పట్ల తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపింది.