: హాహాహాహా... ఏమిదీ, జగన్ రాజకీయం?: దేవినేని ఉమ వ్యంగ్యం


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటోందని వచ్చిన వార్తలపై మంత్రి దేవినేని ఉమ వ్యంగ్యంగా స్పందించారు. "2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ బొమ్మను పెట్టుకుని ప్రజల ముందుకు రాబోతున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీ అన్న, అఖిలేష్ తమ్ముడు ఈ వ్యూహకర్తా... అక్కడ బోర్లబొక్కల పడి, 2019 ఎన్నికలకు... రాహుల్ గాంధీ అన్న, జగన్ మోహన్ రెడ్డి తమ్ముడు... రాజశేఖరరెడ్డి ఆత్మ, కాంగ్రెస్ పార్టీ. హాహాహాహా, ఏమీ రాజకీయాలు" అని ఎద్దేవా చేశారు.

తమ నాయకుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారని గుర్తు చేసిన దేవినేని, వైఎస్ రాక్షస పాలనను చూశారని, పరిటాల రవి వంటి నేతను కోల్పోయామని, ఎన్నో కేసులను ఎదుర్కొని కూడా, ఎటువంటి వ్యూహకర్తల మద్దతు లేకుండా తిరిగి అధికారంలోకి వచ్చామని అన్నారు. ఎలాంటి సర్వేలు తాము చేయించుకోలేదని చెప్పారు. ఓటమి భయంతోనే జగన్ ఇతరుల సహాయం తీసుకుంటున్నాడని, అయినా గెలిచే పరిస్థితే లేదని విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News