: క్రికెటర్ లక్ష్మణ్ కు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నా... ఆనందం!: కేటీఆర్
భారత క్రికెట్ జట్టులో స్టయిలిష్ ఆటగాడిగా పేరు తెచ్చుకుని, ప్రస్తుతం మాజీ ఆటగాడిగా, యువతలోని క్రికెట్ నైపుణ్యాన్ని వెలికితీస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ కు గతంలో తానిచ్చిన హామీని నెరవేర్చుకున్నానని తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. లక్ష్మణ్ నిర్వహిస్తున్న ఫౌండేషన్ కు చెక్ రూపంలో సాయాన్ని అందించిన కేటీఆర్, ఆ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఆనందంగా ఉందని, లక్ష్మణ్ వంటి మంచివారిని కలుసుకోవడం తనకు ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు.