: ఎన్టీఆర్ ధైర్యాన్ని చూడ్డానికి నేను కూడా ఎదురు చూస్తున్నా: రాఘవేంద్రరావు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రశంసల జల్లు కురిపించారు. 'జై లవకుశ' టీజర్ లో ఎన్టీఆర్ ను చూసి ఫిదా అయిపోయానని చెప్పారు. ఇలాంటి పాత్రలు చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలని... ఆ ధైర్యం మా తారక్ కు ఉందని ఆయన అన్నారు. తారక్ ధైర్యాన్ని తెర మీద చూసేందుకు తాను ఎదురు చూస్తున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎన్టీఆర్ చిత్రం 'జై లవ కుశ' సినిమాలోని 'జై' పాత్రకు సంబంధించిన టీజర్ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. తారక్ అన్న కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.