: నా కూతురి బర్త్ సర్టిఫికెట్ నుంచి తండ్రి పేరు కాలం తొలగించండి... నన్ను అవివాహితగా పేర్కొనండి: కోర్టును కోరిన మహిళ


తన కుమార్తె బర్త్ సర్టిఫికెట్ లో తండ్రి పేరు కాలం తీసేయాలని, తనను అవివాహితగా పేర్కొనాలని కోరుతూ ఒక మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించిన ఘటన ఇది. ఆ వివరాల్లోకి వెళ్తే... ముంబైలోని బోరివలి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చి 2014 నవంబర్ లో పండంటి పాపకు జన్మనిచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తనను సింగిల్ పేరెంట్ గా చూపించాలని కోరుతూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ కు అఫిడవిట్ సమర్పించినా, వారు తిరస్కరించారని... తన కుమార్తె బర్త్ సర్టిఫికెట్ లో తండ్రి కాలమ్ ను తొలగించాలని, అలాగే ఆమె బర్త్ సర్టిఫికెట్ రికార్డుల్లో తనను సింగిల్ పేరెంట్ గా, అవివాహితగా పేర్కొనాలని అభ్యర్థిస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ మంజులా చెల్లూర్, జస్టిస్ నితిన్ జందార్ లు ఆమె సమర్పించిన దరఖాస్తు తమ ముందుంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. 

  • Loading...

More Telugu News