: తమిళనాడులో ఎట్టకేలకు తెరుచుకోనున్న సినిమా థియేటర్లు
తమిళనాడులో ఎట్టకేలకు సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. సినిమా టికెట్లపై భారీ పన్ను విధింపును తీవ్రంగా నిరసిస్తూ నాలుగు రోజులుగా బంద్ పాటిస్తోన్న విషయం తెలిసిందే. జీఎస్టీవల్ల సినిమా టిక్కెట్లపై కేంద్రం విధిస్తోన్న 18, 28 శాతం పన్ను శ్లాబులకు అదనంగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో 30 శాతం వినోద పన్ను వసూలు చేస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుభారం 48- 58 శాతంగా లెక్కకొస్తోంది. ఈ అంశాలపై ప్రభుత్వంతో చర్చలు జరిపిన థియేటర్ల యజమానులు ప్రభుత్వం నుంచి ఓ హామీ రావడంతో బంద్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో నాలుగు రోజులుగా సుమారు వెయ్యి థియేటర్లు మూత పడ్డాయి.