: కుల్‌భూషణ్ జాదవ్ కేసు: పాకిస్థాన్ తరఫున ఐసీజేకు అటార్నీ జనరల్ అష్తార్ ఔసఫ్
కుల్‌భూషణ్ జాదవ్ కేసులో భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానం వద్ద వాదించడానికి పాకిస్థాన్ తమ అటార్నీ జనరల్ అష్తార్ ఔసఫ్ను ప్రతినిధిగా నియమించింది. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలన్నీ పాక్ తరఫున అష్తార్ చూసుకుంటారని, ఆయనకు తోడుగా పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ డా. మహ్మద్ ఫైజల్ ఉంటారని ఐసీజే రిజిస్ట్రార్‌కు పాక్ విన్నవించింది. ఈ కేసుతో పాటు భవిష్యత్తులో ఐసీజేతో పాకిస్థాన్‌కు జరగబోయే కార్యకలాపాలను కూడా అటార్నీ జనరల్ వారధిగానే జరుగుతాయని పాక్ స్పష్టం చేసింది.
గతేడాది మార్చి 3న ఇరాన్ నుంచి బెలూచిస్థాన్లో రహస్యంగా చొరబడ్డాడని కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్ మిలటరీ అరెస్ట్ చేసి మరణశిక్ష విధించింది. తర్వాత ఎలాంటి చర్చోపచర్చలకు అవకాశం ఇవ్వకపోవడంతో వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్ కాలరాస్తోందని, జాదవ్ మరణ శిక్షపై స్టే విధించేలా చేయాలని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.