: చెస్‌కి విశ్వనాథన్ ఆనంద్ గుడ్‌బై?
భారత చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఇటీవల తన చరిష్మా కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. ఆల్టీబాక్స్ నార్వే చెస్ పోటీలో తొలి రౌండులోనే ఓడిపోవడం, లూవెన్ లెగ్ గ్రాండ్ చెస్ టూర్‌లో చివరి నుంచి రెండో స్థానంలో నిలవడం వంటి అంశాలు ఆయన ఆటతీరును ప్రభావితం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఇక విశ్వనాథన్ చెస్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటారేమో అన్న సందేహాన్ని కలిగిస్తున్నాయి. `నేను మతి లేకుండా ఆడుతున్నా. ఇది నిజంగా అర్థం లేని పని. ఇలా ఆడటం కంటే ఆడకపోవడం శ్రేయస్కరం` అని విశ్వనాథన్ ఆనంద్ అన్నారు. 2014లో నార్వే ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌పై ఘనవిజయం సాధించిన విశ్వనాథన్ ఆనంద్ మళ్లీ అంత గొప్ప ఆటతీరును ఈ మధ్యకాలంలో ప్రదర్శించలేదు.